నవరత్నధారణతో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?
నవరత్నాలను ధరించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. కెంపు రత్నానికి సూర్యుడు పితృకారకుడు.. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా తండ్రివైపు ఆస్తులు, మగ సంతానం, ఉన్నతాధికారము కలుగుతుంది. అలాగే మాతృకారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యము ధరించాలి. ముత్యమును ధరిస్తే తల్లివైపు వారి నుంచి మంచి జరుగును. శత్రు, రోగ, రుణ విముక్తులు కావొచ్చు. మగ సంతానం కలుగుతుంది. జాతిపచ్చకు బుధుడు అధిపతి. బుధుడు బంధుకారకుడు కావడంతో.. పచ్చను ధరిస్తే బంధువర్గం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగును. గురువు పుత్రకారకుడు- కనుక కనకపుష్యరాగాన్ని ధరించడం ద్వారా సంతానం ద్వారా ధన, ధాన్య, గృహ, వాహనప్రాప్తి ఉంటుంది. దైవపూజ, యజ్ఞయాగాదులు తీర్థయాత్రలు కలిగించును. శుక్రుడు భార్యకారకుడు- కాబట్టి వజ్రాన్ని ధరించడంతో అత్తమామల ద్వారా ధన, ధాన్య, గృహ వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇక శని శ్రమ, ఆయుష్షు కారకుడు.. అందుచేత నీలము ధరించాలి. నీలమును ధరిస్తే శ్రమపడటంతో మంచి జరుగుతుంది. ఆయుర్వుర్ధి కలుగుతుంది. పరిశ్రమలలో గుర్తింపు లభిస్తుంది. ఇక రాహువు ఐశ్వర్యకారకుడు.. కాబట్టి గోమేధికాన్ని ధరిస్తే.. విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి. సంతానప్రాప్తి చేకూరుతుంది. కేతువు జ్ఞానకారకుడు కావడంతో.. మోక్షప్రాప్తి కలుగుతుంది. భక్తి, జ్ఞాన, తీర్థయాత్ర, యజ్ఞయాగాదులు కలిగించును.