నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి.
చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది.
ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది.
ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి. రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.