ధనుస్సు, మకర లగ్నములో జన్మించిన జాతకులైతే..!
ధనస్సు, మకర లగ్నములో జన్మించిన జాతకులు కనకపుష్యరాగము, నీలమును ధరించడం శ్రేయస్కరం. ధనుస్సు లగ్నములో జన్మించిన జాతకులు కనకపుష్యరాగమును ధరించడం ద్వారా గృహ సౌఖ్యము పెరుగుతుంది. అలాగే గృహానికి కొత్త వస్తువులు కొనిపెడతారు. ఇంకా వాహన సౌఖ్యము కూడా చేకూరుతుంది. అలాగే ధనుస్సు లగ్నములో పుట్టిన జాతకులు కెంపును ధరించడం ద్వారా తండ్రి ఆయుష్షు పెరుగును. తండ్రి ద్వారా సంపాదన పెరుగును. అదృష్టము కలిసివస్తుంది. ఇంకా పగడ ధారణ వలన భోగభోగ్యాలు అనుభవిస్తారు. సుఖసౌఖ్యములు, శయ్యాసౌఖ్యములు పెరుగుతాయి. ఇదేవిధంగా నీలరత్నాన్ని మకరలగ్నములో జన్మించిన జాతకులు ధరించడం ద్వారా ధనము, విద్యలో వృద్ధ కనబడును. మానసిక శాంతి కలిగి ఆరోగ్యములో వృద్ధి కనిపిస్తుంది. మాటలలోను తియ్యదనం కల్గును. అలాగే వజ్రమును ధరించడం ద్వారా విశేష ధనప్రాప్తి కలుగును. ధర్మకార్యములలో ఆసక్తి పెరుగును. శుభములతో జీవిస్తారు. జాతిపచ్చ ధారణ వలన సుఖశాంతులతో అభివృద్ధి కలుగును. అదృష్టము చేకూరుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.