Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులా, వృశ్చిక లగ్నములో జన్మించిన జాతకులైతే..!?

Advertiesment
తులా
FILE
తులా, వృశ్చిక లగ్నముల్లో జన్మించిన జాతకులు నీలము, పగడ రత్నాలు ధరించడం ద్వారా ధనము, సుఖము, అప్పులు తీరడం వంటి ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. తులా లగ్నములో జన్మించిన జాతకులు నీలము ధరించడం ద్వారా గృహ సంపద, పుత్రసౌఖ్యము కలుగును. అలాగే జాతిపచ్చను ధరించడం ద్వారా భోగభాగ్యాలు, ఆర్థికాభివృద్ధి చేకూరును. ఇంకా వజ్ర ధారణ వలన ఆయువు మరియు ఆరోగ్యము లభిస్తుంది.

ఇక వృశ్చికలగ్నములో జన్మించిన జాతకులు పగడమును ధరించడం ద్వారా శత్రుభయం తగ్గడం, సోదరుల నుంచి సహాయం వంటి ఫలితాలుంటాయి. ముత్యమును ధరించడంతో తండ్రి ఆయుష్షు, ఆరోగ్యము మరియు ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి వంటివి చేకూరుతాయి. కనకపుష్యరాగమును ధరిస్తే ధనము రాబడి పెరుగును, ప్రతిభ పెరగడం, ఆయురారోగ్యము చేకూరుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu