గోమేధికమును ధరిస్తే ఆకలి పెరుగుతుందట..!!
, బుధవారం, 20 జులై 2011 (17:18 IST)
కేరళ జ్యోతిష సిద్ధాంతము ప్రకారము కెంపును ధరించడం వలన ఆత్మ ఉన్నతి మార్గమును పయనిస్తుంది. అల్సర్, జ్వరము, రూమేటిసమ్ తగ్గిస్తాయి. ముత్యము ధరించడం వలన మెదడుకు బలము చేకూర్చును. జ్ఞాపకశక్తి, ముఖ సౌందర్యమును అందము పెంపొందింపజేస్తుంది. పగడమును ధరించడం ద్వారా మలబద్ధకము, టీబీ, హిస్టీరియా, గుండె, కన్నులు ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చును. వజ్రమును ధరించడం ద్వారా భయమును తగ్గించవచ్చును. ఆర్థిక సుస్థిరత చేకూర్చును. మెదడు ప్రశాంతంగా ఉండును. చర్మవాధులు తగ్గిపోతాయి. సెఫైర్ ధరించడం సంతోషము, ఆనందము పెరగడంతో పాటు మనిషి జీవితకాలము పెరుగును. గోమేధికం ధరించడం వలన ఆకలి పెరగడంతో మంచి ఆరోగ్యమును పెంచి బద్ధకమును పూర్తిస్థాయిలో తగ్గించును. వైడూర్యము ధరించడం వలన అనుకోని దురదృష్టకర సంఘటనలు తొలగించును. వ్యాపారాభివృద్ధి కలిగించును. పక్షవాతము, పిచ్చి తగ్గుతుందని కేరళ జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.