గోమేధికమును ఎప్పుడు.. ఎలా ధరించాలో మీకు తెలుసా?
గోమేధికమును శనివారం, స్వాతి, శతభిష, ఆరుద్ర నక్షత్రాల రోజున ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. వెండిలోగాని, బంగారంలో గానీ, పంచధాతువులతో గాని ధరించవచ్చు. ఆదివారం, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల రోజున ఈ రత్నాన్ని తయారుచేసేందుకు ఇవ్వాలి. "
ఓం ఐం హ్రీం రాహవే నమః" అనే మంత్రమును 18వేల సార్లు బ్రాహ్మణుడితో జపం చేయించి ఎడమచేతి మధ్య వేలుకు ధరించగలరు. శివాలయములోని నవగ్రహముల మండపములోని రాహు విగ్రహము వద్ద ఉంగరము వుంచి రాహు అష్టోత్తరము చేయించి 11/4 కేజీల మినుములు కాఫీ పొడిరంగు వస్త్రములో దానం చేయగలరు. ఎండుద్రాక్ష, తేనె, కంబళి కూడా దానం చేయవచ్చు. శనివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల లోపు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము వుంచి శుద్ధి చేయగలరు. సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించినప్పుడ ఉంగరమునకు పూజ చేయించాలి. కనీసం ధరించే వ్యక్తి రాహు ధ్యాన శ్లోకము 180 సార్లు పారాయణ చేస్తే మంచిది. ఈ రత్నాన్ని ధరించడం చేత అనేక రోగాలు నయమవుతాయి. ధనసంపద, సుఖము, సంతానవృధ్ది కలుగుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.