కన్యారాశి జాతకులు జాతిపచ్చను ఎలా ధరించాలంటే..?
కన్యారాశి జాతకులు జాతిపచ్చను తమ శక్తికి తగినంత బంగారంతో (22 క్యారెట్లు) పొదిగించుకుని ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ జాతిపచ్చను బంగారంతో పొదిగించిన ఉంగరాన్ని పురుషులు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, శరీర బలం పెరుగుతుంది. ఇంకా నూతనోత్సాహం చేకూరడంతో పాటు మానసిక ఒత్తిడి దూరమవుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే కన్యారాశి, చిత్త నక్షత్రంలో పుట్టిన మహిళలు జాతిపచ్చలతో చెవులకు పోగులు, రింగులు, మెడలో నెక్లెస్‌లు వంటివి ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు అంటున్నారు.ఇకపోతే.. చిత్తా నక్షత్రం మొదటిపాదంలో పుట్టిన జాతకులు..: కన్యారాశి జాతకులకు పుట్టిన ఏడు సంవత్సరాల నుంచి 25 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావడంతో గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. ఇంకా 25 సంవత్సరముల నుంచి 41 ఏళ్ల వరకు ఈ జాతకులకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 41-60 సంవత్సరాల వరకు హస్తనక్షత్రం, కన్యారాశిలో పుట్టిన జాతకులకు శని మహర్దశ కాలం నడవటంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. కాగా.. 60-77 వయస్సు వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారంతో పొదిగించి చిటికెన వేలుకు ధరించడం చేయాలి. అలాగే 77-84 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావున ఈ జాతకులు వైఢూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకి ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.