ఉత్తరాషాఢ ఒకటో పాదములో జన్మించిన జాతకులైతే...?
ఉత్తరాషాఢ ఒకటో పాదములో జన్మించిన జాతకులు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపును వేలికి ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఆరు సంవత్సరములు నుండి 16 సంవత్సరముల వరకు ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే 16సంవత్సరముల నుంచి 23వరకు ఈ జాతకులకు కుజమహర్ధశ కావడంతో పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. 23-41 ఏళ్ల వరకు రాహు మహర్ధశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించడం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగవకాశాలు చేకూరుతాయి.41
సంవత్సరముల నుంచి 57 సంవత్సరముల వరకు గురు మహర్ధశ కావువ కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. అలాగే 57 నుంచి 76వ సంవత్సరముల వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి.అలాగే 76వ సంవత్సరం నుంచి 93సంవత్సరముల వరకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారముతో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.