Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!

ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!
FILE
ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన జాతకులు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ జాతకులకు మూడేళ్ల నుంచి 13 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

13-20 సంవత్సరాల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

20-38వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. అలాగే 38-54 సంవత్సరాల వరకు గురు మహర్ధశ కావడంతో కనకపుష్యరాగమును బంగారముతో చూపుడు వేలుకు ధరించాలి.

54 నుంచి 73 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శని మహర్ధశ కావడంతో నీలమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం మంచిది. 73 సంవత్సార నుంచి 90 సంవత్సరాల వరకు బుధ మహర్ధశ కావున బంగారములో చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu