Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనూరాధ నక్షత్రం ఒకటో పాదములో పుట్టిన జాతకులైతే..!?

Advertiesment
అనూరాధ నక్షత్రం
FILE
అనూరాధ నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన జాతకులు ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరముల వయస్సు వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.

19 సంవత్సరముల నుంచి 36 సంవత్సరముల వరకు ఈ జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారములో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. 36-43 సంవత్సరముల వరకు ఈ జాతకులకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది.

అలాగే.. 43 నుంచి 63 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 63 నుంచి 69 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

69-79 సంవత్సరముల వయస్సు వరకు అనూరాధ ఒకటో పాదములో జన్మించిన జాతకులకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

79-86 సంవత్సరముల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu