Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడు వారాలు.. ఎలాంటి ఆభరణాలు ధరించాలి!

Advertiesment
What is the Seventh-day Adventist view on jewelry
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:26 IST)
నగలు, చీరలంటే స్త్రీలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలంటూ ఉండరు. అయితే నగలు రకరకాలుగా ఉన్నా.. ఏడువారాల్లో ఏ నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.  
 
ఏడు వారాలు.. ఏడు వారాలకో గ్రహాధిపతి ఉంటాడు. ఉదాహరణకు ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే శుక్రవారానికి శుక్రుడు అన్నట్లు.. ఆయా వారాన్ని బట్టి ఆ రోజుకి వుండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో జ్యోతిష్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.. 
 
* ఆదివారం సూర్యనికిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపులతో చేసిన నగలు, హారాలు, చెవిపోగులు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
* చంద్రునికి ఇష్టమైంది సోమవారం నాడు ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం శ్రేష్ఠం. ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలకరించుకోవాలి.  
 
* ఇక మంగళవారం కుజుడికిష్టమైనది. ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి. 
 
* బుధుడికిష్టమైనది బుధవారం. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చ రంగు హారాలు, గాజులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
 
* గురువారం బృహస్పతిది. అందుకే గురువారం రోజు పుష్పరాగంతో చేసిన చెవిపోగులు,  ఉంగరాలు ధరించాలి. శుక్రవారం శుక్రుడికిష్టమైనది కాబట్టి.. వజ్రాల హారాలు, ముక్కుపుడుక ధరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు. 
 
శనివారం శనిభగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలి. నీలంతో చేసిన కమ్మలూ, నగలు, ముక్కుపుడుకా పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu