Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయా?

రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయా?
, మంగళవారం, 17 జూన్ 2014 (16:49 IST)
చాలా మందికి రాత్రిపూట అంటే నిద్రలో పీడకలలు, భయానక కలలు వస్తుంటాయి. ఇలాంటి రాత్రి అవుతుందంటే భయంతో వణికిపోతుంటారు. కొందరైతే రాత్రంతా నిద్రపోకుండా అలానే కూర్చొని వుంటారు. ఇలాంటి రత్నాల శాస్త్ర ప్రకారం తమ రాశులకు అనుగుణంగా ఉండే కొన్నింటిని ధరిస్తే ఈ కలల నుంచి ఉపశమనం పొందవచ్చని రత్నాల శాస్త్ర నిపుణులు చెపుతున్నారు. 
 
రాత్రిపూట పీడ కలలు వచ్చే వారు నవరత్నాలలో నీల రత్నాన్ని ధరిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అకస్మాత్తుగా జరిగే దొంగతనాలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే నీలరత్నాన్ని ధరంచడం మంచిదని వారు చెబుతున్నారు. 
 
అలాగే, ముఖకాంతికి, నేత్రకాంతికి నీలం రత్నాన్ని ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. శనిగ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించేందుకు నీలంను ధరిస్తే శ్రేయస్కరమని ఆ శాస్త్రం చెపుతోంది. అలాగే, ఆయుష్షు, బుద్ధి, బలము వృద్ధి చెందేందుకు నీలరత్నధారణ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం.
 
ముఖ్యంగా కుంభరాశి జాతకులు నీలంరత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలుంటాయని చెపుతున్నారు. శాంత స్వభావం, ధర్మకర్మల యందు ఆసక్తి కలిగి ఉండే కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
నీలం ఎక్కువగా శుభ్రముగా ఉండవు. చారలు కలిగి ఉండే అసలైన నీలంను, నీరు నింపిన గ్లాసులో వేస్తే ఆ నీటి నుంచి నీల కిరణాలు వెలువడుతాయి. అదేవిధంగా అసలైన నీలంను ఎండలో వుంచినట్లైతే నీలపు కిరణాలను వెదజల్లుతాయి. 
 
ఎలా ధరించాలంటే.. శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండి లోహంతో పొదిగించుకుని ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగాజలంలో గానీ నీలరత్నాన్ని శుద్ధిచేయాలి. అదేవిధంగా శనిధ్యాన శ్లోకంను 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం. 

Share this Story:

Follow Webdunia telugu