Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూల నక్షత్రం, 1వ పాదములో జన్మించిన వారైతే..?

Advertiesment
మూల నక్షత్రం, 1వ పాదములో జన్మించిన వారైతే..?
, సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (17:35 IST)
మూల నక్షత్రం, ఒకటవ పాదములో జన్మించిన జాతకులు జన్మించిన 7 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావడంతో వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 7-27 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావువ వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. 
 
27-33 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. 33-43 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
43 సం.లు వయస్సు నుంచి 50 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 50-68, 68-84 సంవత్సరముల మధ్య కాలములో పగడమును బంగారములో పొదిగించుకుని మధ్య వేలుకు, కనక పుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu