Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతి రెండో పాద జన్మకారుల రత్నధారణ!

స్వాతి రెండో పాద జన్మకారుల రత్నధారణ!
, శనివారం, 30 ఆగస్టు 2008 (19:17 IST)
స్వాతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి 13 ఏళ్ళ ఆరు నెలల వరకు రాహు మహర్దశ ఉండటంతో.. ఈ దశలో గోమేధికాన్ని వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించడం మంచిది. ఆ తర్వాత 13 సంవత్సరాల ఆరు నెలల నుండి 29 ఏళ్ల ఆరు నెలల వరకు గురుమహర్దశ ప్రవేశించడంతో కనక పుష్యరాగమును బంగారుతో చేసుకున్న ఉంగరాన్ని చేతిలో చూపుడు వ్రేలుకు ధరించినా మంచి ఫలితాన్నిస్తుందని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

29 సంవత్సరాల ఆరు నెలలనుండి 48 ఏళ్ల ఆరు నెలలవరకు శని మహర్దశ జరుగుతుండటంతో.. ఈ దశలో నీలం రత్నాన్ని వెండిలో పొదిగించుకుని వ్రేలుకు ధరించినట్లైతే మంచిఫలితాలనిస్తాయని వారు అంటున్నారు. 48 సంవత్సరాల ఆరునెలల నుండి 65 వయస్సు ఆరు నెలల వరకు బుధ మహర్దశలో సంచరించడంతో పచ్చను బంగారులో పొదిగించి చిటికెన వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

65 సంవత్సరాల ఆరు నెలలనుండి 72 సంవత్సరాల ఆరు నెలల వరకు కేతు మహర్దశ ప్రభావం ఉండటంతో... వైడూర్యాన్ని వెండిలో పొదిగంచి చిటికెన వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 72 సంవత్సరాల ఆరు నెలల నండి 92 ఏడ్ల ఆరు నెలల వరకు శుక్ర మహర్దశ సంచారం కారణంగా వజ్రాన్ని బంగారుతో పొదిగి ఉంగరపు వ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు. 92 సంవత్సరాల ఆరునెలల నుండి 98 ఏళ్ల ఆరు నెలలవరకు రవి మహర్దశ జరగడంతో కెంపును వెండిలో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu