Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతి మూడోపాదం : జన్మకారుల రత్నధారణ...!

స్వాతి మూడోపాదం : జన్మకారుల రత్నధారణ...!
స్వాతి నక్షత్రం మూడోపాదంలో జన్మించిన వారికి తొమ్మిది సంవత్సరాల వయస్సు వరకు రాహుమహర్దశ సంచారం కావడంతో.... గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్యవ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్న శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

తొమ్మిది ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల వయస్సు వరకు గురుమహర్దశ సంచరిస్తుండడంతో..కనకపుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

25 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయస్సు వరకు శనిమహర్దశ ప్రవేశిస్తుండడంతో... నీలమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

44 ఏళ్ళ నుంచి 61 సంవత్సరాల వయస్సు వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో...పచ్చను బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

61 సంవత్సరాల నుండి 68 సంవత్సరాల వయస్సు వరకు కేతుమహర్దశ కావడంతో...వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

68 ఏళ్ళ వయస్సు నుంచి 88 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండటంతో వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

88 సంవత్సరాల ఆరు నెలల నుండి 94 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు రవిమహర్దశ కావడంతో..కెంపును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu