Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహ, కన్యా లగ్నముల్లో పుట్టిన జాతకులైతే..!

సింహ, కన్యా లగ్నముల్లో పుట్టిన జాతకులైతే..!
, శనివారం, 8 జనవరి 2011 (18:51 IST)
FILE
సింహ, కన్యలగ్నాల్లో జన్మించిన జాతకులు కెంపు, వజ్ర రత్నాలను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సింహలగ్నములో పుట్టిన జాతకులు కెంపును ధరించడం వలన ఆయురారోగ్యము, అన్ని విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే పగడమును ధరించడం ద్వారా గృహయోగము కలుగుతుంది. కనకపుష్య రాగమును ధరించడం వల్ల పుత్ర, ధన ప్రాప్తి కలగడంతో పాటు అదృష్టము వీరి వెన్నంటి ఉంటుంది.

అలాగే కన్యాలగ్నములో పుట్టిన జాతకులు వజ్రమును ధరించడం ద్వారా ధనాదాయము, గానకళ, సకలకళల్లో అభివృద్ధి ఉంటుంది. జాతిపచ్చను ధరించడం వలన మానసిక శాంతి కలుగును, ఆయుష్షు పెరిగి ఆరోగ్యము వృద్ధి చెందును.

సామాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా ఈ జాతకులు నీలమును ధరించడం ద్వారా రుణము తీరి, పుత్ర సౌఖ్యము, ధనవృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu