Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహ, కన్యాలగ్నములో జన్మించిన జాతకులైతే..!?

సింహ, కన్యాలగ్నములో జన్మించిన జాతకులైతే..!?
FILE
సింహ, కన్యాలగ్నములో జన్మించిన జాతకులు కెంపు, వజ్రము ధరిస్తే ఆయురారోగ్యముతో పాటు ధనరాబడి పెరుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. సింహలగ్నములో పుట్టిన జాతకులు కెంపును ధరించడం ద్వారా అనుకున్న కార్యాన్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు.

పగడమును ధరిస్తే గృహయోగము కలుగుతుంది. అభివృద్ధి ఉంటుంది. కనకపుష్యరాగమును సింహలగ్నములో జన్మించిన జాతకులు ధరిస్తే పుత్ర, ధన ప్రాప్తితో పాటు అదృష్టము వెన్నంటి ఉంటుంది.

ఇక కన్యాలగ్నములో జన్మించిన జాతకులు వజ్రమును ధరించడం ద్వారా గానకళ మరియు సకల కళ మరియు సకల కళలలో అభివృద్ధి కలుగును. జాతిపచ్చను ధరించడం ద్వారా మానసిక శాంతి కలుగును.

ఆయుష్షు పెరిగి ఆరోగ్యము వృద్ధి చెందును. రాజ్యములో గౌరవము పెరుగును. నీలమును ధరించడం ద్వారా రుణము తీరి, పుత్ర సౌఖ్యము, ధనవృద్ధి వంటి శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu