Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు
, శుక్రవారం, 29 జూన్ 2007 (19:11 IST)
ధనం, శాంతి , కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెపుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

ఏకముఖి రుద్రాక్షను చూడటం వల్లే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి. త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్దిస్తాయి. చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి. పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది. షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది. సప్తముఖి ధరిస్తే దరిద్రం నశించి ధనవంతులవుతారు.

అష్ట ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల దీర్ఘాయుష్కులవుతారు. నవముఖి రుద్రాక్ష నవ దుర్గ రూపి. ఎడమ చేతిన ధరిస్తే శివతుల్యత్వం వస్తుంది. దశముఖి రుద్రాక్షను ధరించినవారికి సకల కోరికలు నెరవేరతాయి. ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్నవి అన్నీ నెరవేరతాయి. ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల తేజస్సు కలుగుతుంది. త్రయోదశముఖి, చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరతాయి. ఇక రుద్రాక్షలున్న మాలతో జపం చేసే వారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరతాయి.

25 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుంది. 27 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేసిన వారికి పుష్టి కలుగుతుంది. 54 రుద్రాక్షలున్న జపం చేస్తే హృదయానికి మంచిది. 108 రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి. రుద్రాక్షను మెడలోగానీ, చేతికి గానీ , నడుముకు గానీ కట్టుకోవాలి. పిల్లలకు ధరింప చేస్తే బాలారిష్ట దోషాలు పోవటమే కాక అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులవుతారు.

Share this Story:

Follow Webdunia telugu