Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంతాన ప్రాప్తికి పుష్యరాగం ధరించండి

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి రత్నాల శాస్త్రం పుష్యరాగం సంతాన ప్రాప్తి వజ్రం వైఢూర్యం ఉన్నత విద్య మంత్రి పదవి
పుష్యరాగం: పసుపు వన్నెగల పుష్యరాగం గురుగ్రహానికి వర్తిస్తుంది. మీనం, ధనుస్సు, గురుని రాశులు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర గురు నక్షత్రాల్లో జన్మించినవారు పుష్యరాగంను ధరించవచ్చు. జనన కాలంలో గురుగ్రహం చెడు స్థానాలలోను, దుర్భల రాశులలోను ఉండగా జన్మించినవారు.. గురు మహాదశ నడుస్తున్నవారు కూడా పుష్యరాగం ధరించవచ్చు.

ఉన్నత విద్య, మంత్రి పదవి, న్యాయ, అధ్యాపక, రాజకీయ వృత్తులకు ఇది అనుకూలం. ఆర్థిక బాధలు తొలగి ఆదాయం పెరగడానికి, సంతాన ప్రాప్తికి పుత్ర సంతానానికి వివిధ శాస్త్రాలలో విజ్ఞానానికి, కీర్తికి, మంత్రసిద్ధికి పుష్యరాగం ధరించడం శ్రేయస్కరం.

వజ్రం: రత్నాలలో అతి ఖరీదైనది వజ్రం. నవగ్రహాలలో శుక్రునికి ఇది వర్తిస్తుంది. వృషభ, తులా రాశులు శుక్రుని రాశులుగా పరిగణిస్తారు. అదే విధంగా... భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలు కూడా శుక్రునివే. అందుచేత పై రాశులు, నక్షత్రాలలో పుట్టిన జాతకులు వజ్రాన్ని ధరించవచ్చు.

అదే విధంగా... ఏప్రిల్ 21 మే 20 మధ్య జన్మించిన వృషభరాశి జాతకులు, సెప్టెంబర్ 24 అక్టోబరు 23 మధ్య జన్మించిన తులారాశి జాతకులు వజ్రాన్ని ధరించవచ్చును. శుక్రదశలో ఉన్న వారు కూడా వజ్రం ధరించడం వల్ల సకల సంపదలు చేరువవుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వైఢూర్యం: తెల్లగా కనిపించే వైఢూర్యాన్ని కనుగొనాలంటే.... రత్నానికి మధ్యలో ఒక రేఖ ఉంటుంది. సూర్యకాంతిలో దీనిని కదిపి చూస్తే తెల్లటి వెండిరేఖ కనిపిస్తుంది. ఇది కేతురత్నం.

అశ్విని, మఘ, మూల, కేతు నక్షత్రాలు, కేతు అంకె 7 కనుక 7, 16, 25 తేదీలలో పుట్టినవారు, ఫిబ్రవరి 20 మార్చి మీనరాశిలో జన్మించినవారు.. అశ్విని, మఘ, మూల నక్షత్ర జాతకులు వైఢూర్యం ధరించవచ్చు.

కేతు దశలో కూడా ఇది చాలా శుభఫలితాలను అందిస్తుందని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది. 3, 5, 7, 8 క్యారెట్ల వైఢూర్యాన్ని వెండితో పొదిగించి ధరిస్తే అష్టైశ్వర్యాలు చేరువవుతాయని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu