Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృషభ లగ్న జాతకులు ఎలాంటి రత్నాలు ధరిస్తే మేలు!?

వృషభ లగ్న జాతకులు ఎలాంటి రత్నాలు ధరిస్తే మేలు!?
, బుధవారం, 30 ఏప్రియల్ 2014 (19:29 IST)
File
FILE
వృషభ లగ్నములో జన్మించిన జాతకులు బంగారమును వజ్రముతో పొదిగించుకుని ధరించగలరు. ఈ జాతకులు శని నవమ దశమాధిపతి కావున జాతకచక్రములో కేంద్రములో వున్నచో వండిలో నీలమును ధరించగలరు. బుధుడు ద్వితీయ పంచమాధిపతి కావున జాతక చక్రములో కోణములో వున్నచో బంగారములో జాతిపచ్చను ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఈ జాతకులకు కుజుడు, సప్తమ, వ్యయాధిపతి అగును. వ్యయాధిపతి కావున పగడమును ధరించరాదు. గురువు అష్టమ ఏకాదశాధిపతి అగును. ఈ జాతకులకు గురువు, అష్టమము రెండూ పాపస్థానములు అగుట వలన కనకపుష్యరాగమును ధరించరాదు. చంద్రుడు తృతీయాధిపతి అగుట ద్వారా ముత్యమును కూడా ఈ జాతకులు ధరించకూడదు.

Share this Story:

Follow Webdunia telugu