వృశ్చిక లగ్న జాతకులు పచ్చను ధరించకూడదట!
, గురువారం, 24 నవంబరు 2011 (16:16 IST)
వృశ్చిక లగ్న జాతకులు ధరింపవలసినవి:* కుజుడు లగ్న, షష్ఠామాధిపతి. కావున జాతకచక్రములో కుజుడు కేంద్రములో వుండినట్లైతే పగడము వెండిలో ధరించాలి.* చంద్రుడు నవమాధిపతి. కావున జాతకచక్రములో ద్వితీయ, పంచమ, నవమ స్థానము నందువున్నచో పగడము వెండిలో ధరించాలి.* గురువు ద్వితీయ పంచమాధిపతి. కావున జాతక చక్ర కోణములో వున్నట్లైతే కనకపుష్యరాగం బంగారములో ధరించాలి.ధరించకూడనివి:* బుధుడు అష్టమ ఏకాదశాధిపతి. అష్టమాధిపతి అగుటవలన పచ్చను ధరించకూడదు.* శుక్రుడు సప్తమ, ద్వాదశాధిపతి. రెండు పాపస్ధానములు అగుటచే వజ్రమును ధరించరాదు.* శని తృతీయ చతుర్ధాధిపతి. తృతీయాధిపతి అగుట వలన నీలమును ధరించరాదు.