Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిణి మొదటిపాదం: జన్మకారుల రత్నధారణ

రోహిణి మొదటిపాదం: జన్మకారుల రత్నధారణ
, బుధవారం, 10 సెప్టెంబరు 2008 (14:00 IST)
రోహిణి నక్షత్రం మొదటిపాదంలో జన్మించిన వారికి పది సంవత్సరాల పాటు చంద్రమహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

పది సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు కుజమహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారంలో పొదిగంచి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలి.

అలాగే 17 ఏళ్ల నుండి 35 సంవత్సరాల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

35 సంవత్సరాల నుండి 51 ఏళ్ళ వరకు గురుమహర్దశ జరగడంతో కనకపుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

51 సంవత్సరాల నుండి 70 ఏళ్ళ వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

70 ఏళ్ళ నుంచి 87 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

87 సంవత్సరాల నుంచి 94 సంవత్సరాల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu