Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిణి నాలుగోపాదం: జన్మకారుల రత్నధారణ

రోహిణి నాలుగోపాదం: జన్మకారుల రత్నధారణ
, మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (19:34 IST)
రోహిణి నక్షత్రం నాలుగోపాదంలో జన్మించిన వారికి రెండు సంవత్సరాల ఆరునెలల వరకు చంద్రమహర్దశ సంచారం కారణంగా ముత్యమును వెండిలో పొదిగి ఉంగరపువ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

రెండు సంవత్సరాల ఆరునెలల నుండి తొమ్మిది ఏండ్ల ఆరు నెలల వరకు కుజమహర్దశ సంచారం కారణంగా పగడాన్ని బంగారులో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
తొమ్మిది సంవత్సరాల ఆరునెలల నుండి 27 సంవత్సరాల ఆరు నెలల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు
27 సంవత్సరాల ఆరు నెలల నుండి 43 ఏళ్ళ ఆరు నెలల వరకు గురుమహర్దశ జరగడంతో కనకపుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

43 సంవత్సరాల ఆరు నెలల నుండి 62 ఏళ్ళ ఆరు నెలల వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

62 ఏళ్ళ ఆరు నెలల నుంచి 79 సంవత్సరాల ఆరు నెలల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

79 సంవత్సరాల ఆరు నెలల నుంచి 86 సంవత్సరాల ఆరు నెలల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu