Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృగశిర మొదటిపాదం : జన్మకారుల రత్నధారణ...!

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి రత్నాల శాస్త్రం మృగశిర నక్షత్రం మహర్దశ జన్మకారుల రత్నధారణ
, సోమవారం, 29 సెప్టెంబరు 2008 (20:28 IST)
మృగశిర నక్షత్రం మొదటిపాదంలో జన్మించిన వారికి ఏడు సంవత్సరాల వయస్సు వరకు కుజమహర్దశ సంచారం కారణంగా పగడమును బంగారంలో పొదిగి ఉంగరపువ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటోంది.

ఏడు సంవత్సరాల నుండి 25 ఏళ్ళ వరకు రాహుమహర్దశ కావటంతో... గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

25 ఏళ్ళ నుంచి 41 సంవత్సరాల వయస్సు వరకు గురుమహర్దశ సంచరిస్తుండడంతో... కనకపుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

41 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు శనిమహర్దశ సంచరిస్తుండడంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

60 ఏళ్ళ నుంచి 77 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో...పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

77 సంవత్సరాల నుండి 84 సంవత్సరాల వరకు కేతుమహర్దశ కావడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

84 ఏళ్ళ వయస్సు నుంచి 104 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండటంతో వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu