మూల నక్షత్రము నాలుగో పాదములో పుట్టినవారైతే..!
మూలనక్షత్రము నాలుగో పాదములో పుట్టిన జాతకులు పుట్టిన రెండు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశ కావడంతో వజ్రమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 22-28
వ సంవత్సరం వరకు ఈ జాతకులకు రవి మహర్ధశ కావడంతో కెంపును వెండితో ఉంగరపు వేలుకు ధరించగలరు. 28-38సంవత్సరాల వరకు మూల నక్షత్రము, నాలుగో పాదములో పుట్టిన జాతకులకు చంద్ర మహర్ధశ కావడంతో వెండితో పొదిగించిన ముత్యమును ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే 38-45 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. ఇంకా 45-63 సంవత్సరములు వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. ఇకపోతే.. 63-79 సంవత్సరాల వరకు ఈ జాతకులకు గురు మహర్ధశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇకపోతే మూల నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. ఆదివారం, సోమ, మంగళస గురు, శనివారాలు వీరికి అనుకూలించవు. రంగుల విషయానికొస్తే.. నలుపు, తెలుపు, నీలము, పచ్చ రంగులు వీరికి శుభఫలితాలనిస్తాయి.