నాలుగు గురిగింజల ఎత్తు ఉండే ముత్యాన్ని ఎంచుకోవాలని, దీనిని వెండిలో పొదిగించుకుని ధరించగలరని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. ముత్యం అరిగిపోకుండా చూసుకున్నంత వరకు దాని ప్రభవం ఉంటుందని, దీనిని రెండు, నాలుగు, ఆరు, 11 గురిగింజల ఎత్తు బరువు కలిగిన వెండిలో పొదిగించుకున్నట్లైతే మంచి ఫలితాలను ఇస్తుందని వారు చెబుతున్నారు.
సోమవారం శ్రావణం, రోహిణీ, హస్త నక్షత్రాల సంచారంలో ఉదయం పది నుంచి మద్యాహ్నం పన్నెండు గంటల లోపు ముత్యాన్ని తయారుచేసి ఉండాలని అలాంటి నక్షత్రాల్లో చేసిన ముత్యపు ఉంగరాన్ని ధరించిన వారికి శుభాలు ఫలితాల్నిస్తుందని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
పచ్చి పాలలో, గంగా జలంలో ఒక రోజంతా ముత్యాన్ని ఉంచి శుద్ధి చేయాలని, ముత్యాన్ని ధరించునప్పుడు ఓం చంద్రమసే నమ: అనే నామాన్ని జపిస్తూ ముత్యమును కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలని రత్నశాస్త్రకారులు చెబుతున్నారు. ముత్యాన్ని ధరించునప్పుడు పెరుగు, పాలు, వెండి, దూది, బియ్యం, నెయ్యి తదితరాలను దానం చేయాలాని చెబుతున్నారు. ఈ విధంమైన ఆచారంతో ముత్యాన్ని ధరించిన వారికి మానసిక శాంతి ప్రేరణ, ఆనందం కలుగుతుందని రత్నశాస్త్రకారులు వెల్లడిస్తున్నారు.