Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మఖ మూడోపాదం : జన్మకారుల రత్నధారణ...!

మఖ మూడోపాదం : జన్మకారుల రత్నధారణ...!
, సోమవారం, 13 అక్టోబరు 2008 (15:15 IST)
మఖ నక్షత్రం మూడోపాదంలో జన్మించిన వారికి మూడు సంవత్సరాల ఆరునెలల వయస్సు వరకు కేతుమహర్దశ సంచారం కావడంతో.... వైఢూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్న శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మూడు ఏళ్ళ ఆరు నెలల వయస్సు నుంచి 23 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

23 సంవత్సరాల ఆరు నెలల నుంచి 29 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు రవిమహర్దశ ప్రవేశిస్తుండడంతో... కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

29 ఏళ్ళ ఆరు నెలల నుంచి 39 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు చంద్రమహర్దశ సంచరిస్తుండడంతో... ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

39 సంవత్సరాల ఆరు నెలల నుండి 46 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు కుజమహర్దశ కావడంతో... పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

46 ఏళ్ళ ఆరు నెలల వయస్సు నుంచి 64 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు రాహుమహర్దశ సంచరిస్తుండటంతో గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

64 సంవత్సరాల ఆరు నెలల నుండి 94 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు గురుమహర్దశ కావడంతో..కనకపుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu