Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీలరత్నాన్ని ఎప్పుడు..ఎలా.. ధరించాలి?

Advertiesment
నీలరత్నాన్ని ఎప్పుడు..ఎలా.. ధరించాలి?
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2013 (18:11 IST)
FILE
నవరత్నాల్లో నీల రత్నాన్ని శనివారం, పుష్యమి, చిత్త, స్వాతి, ధనిష్ఠ నక్షత్రాల రోజున ధరించవచ్చును. వెండిలోగానీ పంఛధాతువులతో చేసిన లోహముతో పొదిగించుకుని ధరించవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

* శివాలయములోని నవగ్రహముల మండపములోని శని విగ్రహమునకు శనికి తైలాభిషేకము చేయించి 11/4
కేజీల నల్ల నువ్వులు నల్లని వస్త్రములో దానం చేయాలి.

* శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము వుంచి శుద్ధి చేసి ధరించగలరు.

* బ్రాహ్మణుడితో 19వేల సార్లు శని వేదమంత్రం (ఓం శని శనియే నమః) జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయగలరు. శైవక్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు.

* కనీసం ధరించే వ్యక్తి శని ధ్యానశ్లోకము 190 మార్లు పారాయణ చేసి ధరించగలరు.

దానం చేయవలసినవి : మేకు, ఆవు పెరుగు, నల్లద్రాక్ష, నువ్వండలు, చెప్పులు.
ధారణ ఫలితములు : ఏలినాటి శని తొలగిపోతుంది. శనిదోష నివారణ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu