Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవరత్నాలను ధరించాలనుకుంటున్నారా...?

Advertiesment
నవరత్నాలు కెంపు ముత్యం పగడం గరుడ పచ్చ
, గురువారం, 10 జనవరి 2008 (13:56 IST)
దంతాలు, చర్మం, నేత్ర, ముఖానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొనేవారు.... కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినవారు కెంపును ధరించిన శుభం కలుగుతుంది. మానసిక చంచలత్వం, గొంతు, కఫం, దగ్గు, జలోధర, మతిమరుపు కలిగినవారు... రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రానికి చెందినవారు ముత్యం, స్పందన ముత్యం, భాస్కర ముత్యం ధరించిన శుభం కలుగుతుంది.

రక్తహీనత, ఉద్రేకం కలిగినవారు... మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రానికి సంబంధించినవారు పగడం, తెల్లపగడం ధరించిన మంచిది. బుద్ధి, చర్మ, జీవహ్మ, ఉదరం, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనేవారు.... అశ్రేష, జ్యేష్ఠ్య, రేవతి నక్షత్రంవారు పచ్చ, గరుడ పచ్చ, మయూరి మరకతం అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది.

జ్ఞానం, సుఖం, పుత్ర, విద్యాభివృద్ధికి, నరాలకు సంబంధించిన సమస్యలు తొలగుటకును... పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారు పుష్యరాగం, కనక పుష్య రాగం, వైక్రాంతమణి రాయిని ధరిస్తే శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu