ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!
ధనిష్ట నక్షత్రం మూడో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన మూడు సంవత్సరముల నుంచి ఆరు నెలల వయస్సు కుజ మహర్ధశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 3 సం.ల ఆరు నెలల వయస్సు నుండి 21 సం.ల ఆరు నెలలు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో మధ్యవ్రేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల నిపుణులు అంటున్నారు. 21
సం.ల 6 నెలలు వయస్సు నుండి 37 సం.ల 6 నెలలు వరకు గురు మహర్ధశ కావున కనక పుష్యరాగమును బంగారముతో చూపుడు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. అలాగే 37 సం.ల ఆరు నెలలు వయస్సు నుండి 56 సం.ల 6 నెలలు వరకు శని మహర్దశ కావున నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు. 56
సం.ల 6 నెలల నుండి 73 సం.ల ఆరు నెలల వరకు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది. 73
సం.ల ఆరు నెలల నుంచి 80 సం.ల ఆరు నెలల వరకు ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో జన్మించిన జాతకులు వైడూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.