Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుజదోష నివారణకు పగడం ధరించండి

కుజదోష నివారణకు పగడం ధరించండి
మీరు వృశ్చికరాశిలో జన్మించారా..? లేదా మీకు కుజదోషముందని జ్యోతిష్కులు చెప్పారా..? అయితే ఏం భయపడకండి..! కుజదోష నివారణకు పగడం ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఆంగ్లంలో కొరల్ అని పిలువబడే పగడం ఎరుపు రంగును కలిగి ఉంటుంది.

భౌమరత్నము, ప్రవాళము, మిరజాన్ పోలా అనే పిలువబడే పగడాన్ని ధరించడం ద్వారా భూతప్రేతాది భయాలు తొలగిపోతాయని రత్నాలశాస్త్రం చెబుతోంది. పగడ రత్నముతో తయారైన మాలను వృశ్చికరాశి మహిళలు ధరిస్తే.. దిష్టి దరిచేరదు. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కావున.. ఈ జాతకులు మొండి పట్టుదల కలవారుగా ఉంటారు.

పగడాన్ని ఎలా కనుగొనడం ఎలా...?
పగడం చాలా సున్నితంగా ఉండి పట్టుకుంటే జారిపోతుంది. నిజమైన పగడాన్ని నిప్పులో వేస్తే కాంతిపోతుంది. దీనిపై నీటి బిందువులు ఉంచితే అలానే ఉంటాయి. నిజమైన పగడంపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే దానిపై మచ్చపడుతుంది.

ఎలా ధరించాలంటే..?
మంగళవారం సూర్యోదయానికి ముందు ధరించాలి. రాగి, వెండి లోహముతో పొదిగించి పగడాన్ని ధరించడం శ్రేయస్కరం. కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలు మరియు గంగా జలములో శుద్ధి చేయాలి. కుజధ్యాన శ్లోకము 70 మార్లు ధ్యానించి ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu