ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!
ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన జాతకులు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ జాతకులకు మూడేళ్ల నుంచి 13 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 13-20
సంవత్సరాల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 20-38
వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. అలాగే 38-54 సంవత్సరాల వరకు గురు మహర్ధశ కావడంతో కనకపుష్యరాగమును బంగారముతో చూపుడు వేలుకు ధరించాలి. 54
నుంచి 73 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శని మహర్ధశ కావడంతో నీలమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం మంచిది. 73 సంవత్సార నుంచి 90 సంవత్సరాల వరకు బుధ మహర్ధశ కావున బంగారములో చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.