Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లీషు అక్షరాలలో మీ సంఖ్య

ఇంగ్లీషు అక్షరాలలో మీ సంఖ్య
, బుధవారం, 16 జనవరి 2008 (19:14 IST)
సంఖ్యా శాస్త్రంలో పూర్తి పేరుని బట్టి వారివారి సంఖ్యలను తెలుసుకునే విధానమూ ఉంది. కొంతమందికి జనన తేదీ, మాసం, సంవత్సరం గుర్తు ఉండదు. అప్పుడు పూర్తి పేరును బట్టి మనం వారి సంఖ్యను తెలుసుకోవచ్చు.

ఇంగ్లీషు అక్షరాల ద్వారా సంఖ్యను తెలుసుకునే విధానం;
1 2 3 4 5 6 7 8
A B C D E U O F
I K G M H V Z P
J R L T N W
Q S X

పైన తెలిపిన అక్షరాలను పరిశీలించి వాటికి సంబంధించిన సంఖ్యలను వేసి కూడగా 2+1+4+1+5=13 వాటిని మరలా కూడగా 1+3= 4... అంటే నాలుగో సంఖ్యవారు అవుతారన్నమాట.
ఇదే విధంగా... R O H I N I... ( 2 7 5 1 5 1)
2+7+5+1+5+1= 21= 2+1= 3... అంటే మూడవ సంఖ్యవారు అవుతారు.

నక్షత్రాలను బట్టి సంఖ్యను కనుగొనటం:
మన నక్షత్రాలు 27. అంటే 2+7= 9. ఎవరైనా ఈ 27 నక్షత్రాల యందు మాత్రమే జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి కొన్ని అక్షరములు కలవు. కాబట్టి ప్రతి మానవుడు ఏదో ఒక నక్షత్రానికి సంబంధించినవారై ఉంటారు. ఉదాహరణకు: రామారావు అనే పేరుగలవారి మొదటి అక్షరము 'రా'. అంటే... పేరు యందు మొదటి అక్షరాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ 'రా' అనే అక్షరము చిత్తా నక్షత్రానికి సంబంధించినది. అంటే ఈ పేరు గలవారు చిత్తా నక్షత్రముగలవారై ఉంటారు. అశ్వనీ నక్షత్రము మొదలు చిత్తా నక్షత్రము 14వది అవుతుంది. అంటే... వీరు 1+4= 5వ సంఖ్యవారు అవుతారు.

మరో ఉదాహరణ: ఏసుపాదం అనే పేరుగలవారు కృత్తిక నక్షత్రంవారై ఉంటారు. కృత్తిక నందు 'ఏ' అనే అక్షరం ఉండటం వల్ల, ఆ నక్షత్రం మూడవ స్థానంలో ఉన్నది కావున వారు 3వ సంఖ్యవారై ఉంటారు. ఇలాగే వారములను బట్టి కూడా మనం ఏ సంఖ్యవారో గ్రహించవచ్చు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం... రవి అంటే ఆదివారం(1), చంద్రునికి సోమవారం(2), కుజునికి మంగళవారం (9); బుధునికి బుధవారం (5); గురునికి గురువారం (3); శుక్రునికి శుక్రవారం (6); శనికి శనివారం (8); సంఖ్యలు వస్తాయి. కేతువు ఛాయా గ్రహాలు కనుక రవికి 4వ సంఖ్య (అంటే రాహువు) అదనంగానూ వచ్చుచున్నారు. మొత్తం 9 సంఖ్యలు, 9 గ్రహాలు, 7 వారాలకు 9 సంఖ్యలు ఇవ్వబడింది.

ఎవ్వరికైనా పుట్టిన వారం తెలిసినచో... ఆ వారం చూసుకుని, ఆ సంఖ్యవారుగా చూసుకోవచ్చు. ఉదా: సోమవారం జననం అనుకోండి... చంద్రుడు అధిపతి 2వ సంఖ్యవారుగానూ, శుక్రవారం జననం అయినచో 6వ సంఖ్యవారుగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం బాగా పరీక్షించినట్లయితే ఒకటవ సంఖ్య గలవారు 4వ సంఖ్య గలవారిపై ఇష్టం, ప్రేమగలవారుగా ఉంటారు. అలాగే 2వ సంఖ్యవారు 7వ సంఖ్యవారిపై ఆదరాభిమానాలు అధికంగా ఉండగలవు. తెలుగు అక్షరాలననుసరించి సంఖ్యను తెలుసుకొనే విధానాన్ని మరోసారి చూద్దాం

Share this Story:

Follow Webdunia telugu