అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారికి ఐదు సంవత్సరాల వయస్సు వరకు కేతు మహర్దశ సంచరించును. ఈ దశలో వైఢూర్యాన్ని వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తుందని రత్నాల శాస్త్రకారులు తెలుపుతున్నారు. ఐదు సంవత్సరాలనుండి 25 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ జరుగుతుంది. ఈ దశలో వజ్రాన్ని బంగారుతో ఉంగరపు వేలుకు ధరించాలని వారు వెల్లడిస్తున్నారు.
25 ఏళ్ల వయస్సు నుండి 31 సంవత్సరాల వరకు రవిమహర్దశ జరుగుతుండటంతో... ఈ దశలో కెంపును ఉంగరపు వేలుకు ధరించాలని, 31 నుండి 41 ఎళ్ళ వయస్సు వరకు ముత్యమును పొదిగించుకున్న వెండి ఉంగరాన్ని.... ఉంగరపువేలుకు ధరించాలని రత్నశాస్త్రవాదుల వాదన.
41 సంవత్సరాల నుంచి 58 ఏళ్ళ వయస్సు వరకు కుజదశ సంచరిస్తుంది. ఈ దశలో పగడాన్నిబంగారంతో పొదిగించుకుని వేలుకు ధరించినట్లైతే శుభపరిణామాలు ఉంటాయని రత్నశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.
58 ఏళ్ల వయస్సు నుండి 66 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. ఈ దశలో గోమేధికం వెండితో కలిపిన ఉంగరాన్ని ధరించాలని నిపుణులు తెలుపుతున్నారు. 66 నుండి 82 ఏళ్ల వయస్సు వరకు గురుమహర్దశ ఈ దశలో పుష్యరాగమును బంగారంతో కలిపి చూపుడు వేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తాయని రత్ననిపుణులు వెల్లడిస్తున్నారు.