అశ్వినీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారికి రెండు సంవత్సరాల వయస్సులో కేతు మహర్దశ ఉండటంతో.. ఈ దశలో వైడూర్యాన్ని వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించడం మంచిది. ఆ తర్వాత రెండు సంవత్సరాలనుండి 22 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ ప్రవేశించడంతో వజ్రానికి బంగారుతో చేసుకున్న ఉంగరాన్ని చేతికి ధరించినా మంచి ఫలితాన్నిస్తుందని రత్నాల నిపుణులు చెబుతున్నారు.
22 సంవత్సరాలనుండి 28 ఏళ్లవరకు రవి మహర్దశ జరుగుతుండటంతో ఈ దశలో కెంపు రత్నాన్ని వెండిలో పొదిగించుకుని వ్రేలుకు ధరించినట్లైతే మంచిఫలితాలనిస్తాయని వారు అంటున్నారు. 28 నుండి 38 వయస్సు వరకు చంద్ర మహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.
38 సంవత్సరాలనుండి 45 సంవత్సరాల వరకు మహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారులో పొదిగంచి వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 45 నండి 63 ఏడ్లవరకు రాహు మహర్దశ సంచారం కారణంగా గోమేధికాన్ని వెండితో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు. 63 నుండి 79 వరకు గురు మహర్దశ జరగడంతో పుష్యరాగమును బంగారంలో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.