Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనురాధ నక్షత్రంలో పుట్టారా? కెంపు ధరించండి

అనురాధ నక్షత్రంలో పుట్టారా? కెంపు ధరించండి
, సోమవారం, 4 ఆగస్టు 2008 (19:15 IST)
అనురాధా నక్షత్రంలో పుట్టిన జన్మకారులు పుష్యరాగం, కెంపులను ధరించడం ద్వారా శుభఫలములు కలుగునని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. కుటుంబ సమస్యలు, ఊహించని సమస్యలు, చేపట్టిన ప్రతిపనిలో ఆటంకాలు తలెత్తడం వల్ల కార్యభారం పెరగడం వంటి సమస్యలు పుష్యరాగం, కెంపు ధారణతో తొలగిపోతాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

వీటిని ధరించడం వల్ల.. శ్రమాధిక్యం, స్వల్పలాభం, వ్యాపార భాగస్వామ్యుల మధ్య కలతలు తొలగిపోయి.. నూతన వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు భవిష్యత్తులో సత్ఫలితానిచ్చేందుకు తోడ్పడుతాయి. భూగృహాదులలో మార్పులు చేర్పులు చేస్తారు. అక్రమ వ్యాపారంలో కష్టాలు తప్పవు. స్టాకిస్టులు, షేర్ల వ్యాపారులకు పుష్యరాగ ధారణతో విశేషంగా కలిసి వస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అనురాధ నక్షత్రంలో పుట్టిన జన్మకారులకు 1 ,2 ,4, 6, 11 మాసములు విశేషలాభములు చేకూరుతాయి. వ్యవసాయం, కాంట్రాక్టులు, కలప, అపరాలు ఫ్యాన్సీ రంగాలవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. రాజకీయ రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు. కుజదోషం అధికంగా ఉన్నా, గురుసంచార ప్రభావంతో ప్రమాదాలు కొంత వరకు నివృత్తి అవుతాయి.

విద్యార్థులు సత్ఫలితాల కోసం పుష్యరాగాన్ని గానీ లేదా కెంపును ధరించడం మంచిది. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, షేర్ల వ్యాపారులకు ఆర్ధిక ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అదృష్టప్రదం. నవగ్రజపశాంతులు, దుర్గా, చండీ పారాయణం, రుద్రాభిషేకం, శివదర్శనం చేస్తే విశేష శాంతి, మంగళ, గురువార నియమాలు యోగదాయకం. ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు 1,2,3,9 ఆది, సోమ, గురువారాలు యోగప్రదం.

Share this Story:

Follow Webdunia telugu