Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2021లో వెన్నెలకంటి నుంచి సిరివెన్నెల దాకా... రాలిపోయిన సినీ సెలబ్రిటీలు

2021లో వెన్నెలకంటి నుంచి సిరివెన్నెల దాకా... రాలిపోయిన సినీ సెలబ్రిటీలు
, సోమవారం, 27 డిశెంబరు 2021 (20:09 IST)
2021లో భారతదేశ చలనచిత్రం రంగంలోని పలువురు ప్రముఖులను పోగొట్టుకుంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 2021 సంవత్సరం ప్రారంభం జనవరి 5న 2000కు పైగా పాటలు రాసిన ప్రముఖ తెలుగు గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ జనవరి 5న గుండెపోటుతో కన్నుమూశారు. 63 ఏళ్ల వయస్సున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆయన సహచరులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

 
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ఏప్రిల్ 17న గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన మరణానికి కారణం వ్యాక్సన్ అని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కారణం అది కాదని తేలింది. గుండెపోటు కారణంగానే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

 
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్ అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 46. పునీత్ రాజ్‌కుమార్‌కు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ వైద్యుని సంప్రదించిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన చనిపోయాడు.

webdunia
ప్రముఖ మలయాళ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి శరణ్య శశి ఆగస్టు 9న కోవిడ్-19 సమస్యల కారణంగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 35.
 
అభిలాషా పాటిల్ మే 4న కోవిడ్-19 పాజిటివ్ పరీక్షల అనంతరం కన్నుమూశారు. ఆమె వయసు 47.

 
కన్నడ నటుడు సంచారి విజయ్ జూన్ 15న కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడి వయసు 37. ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.

 
ప్రముఖ నటి- చిన్నారి పెళ్లికూతురు సురేఖ సిక్రి (75) గుండెపోటుతో మరణించారు. ఆమె జూలై 16న మరణించింది.

webdunia
సెప్టెంబర్ 2న భారీ గుండెపోటుతో నటుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. బాలికా వధు ఫేమ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత మరణం అతని సహచరులకు, అభిమానులకు షాక్ ఇచ్చింది.
 
రాజీవ్ కపూర్ ఫిబ్రవరి 9న గుండెపోటుతో మరణించారు. రామ్ తేరీ గంగా మైలీలో అతని పనికి అతను బాగా గుర్తుండిపోయాడు.

webdunia
భారతదేశంలోని 10 భాషా చిత్రాల్లో కొరియాగ్రాఫర్ గా పనిచేసిన శంకర్ మాస్టర్ కోవిడ్ 19 కారణంగా నవంబరు 28న కన్నుమూశారు. ఆయన దక్షిణాది చిత్రాలతోనే పాపులర్ అయ్యారు.
 
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబరు 30న కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ, ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ‌రిత విజ‌య‌వాడ‌ను సాధిద్దాం... ప‌ర్యావ‌ర‌ణం కాపాడుదాం...