Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే... టర్మ్ ఇన్సూరెన్స్‌తో భద్రత...

జీవితం క్షణభంగురం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే సామెత మనకు తెలిసిందే. జీవితంలో దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే ఆదుకునేవారు ఎంతమంది వుంటారో తెలియదు కానీ టర్మ్ ఇన్సూరెన్సుతో జీవితానికి భరోసానిస్తుంది. కుటుంబ యజమాని దూరమైనప్పుడు ఆయననే నమ్ముకున్నవారికి ఈ న

దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే... టర్మ్ ఇన్సూరెన్స్‌తో భద్రత...
, గురువారం, 1 జూన్ 2017 (20:46 IST)
జీవితం క్షణభంగురం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే సామెత మనకు తెలిసిందే. జీవితంలో దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే ఆదుకునేవారు ఎంతమంది వుంటారో తెలియదు కానీ టర్మ్ ఇన్సూరెన్సు జీవితానికి భరోసానిస్తుంది. కుటుంబ యజమాని దూరమైనప్పుడు ఆయననే నమ్ముకున్నవారికి ఈ నిధి ఎంతగానో తోడ్పడుతుంది. తమపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెద్ద మొత్తం అందేలా ఇది ఉపయోగపడుతుంది. 
 
రూ. 1 కోటి లైఫ్‌ కవరేజినిచ్చే ఇచ్చే టర్మ్‌ పాలసీకి ఏడాదికి 8 వేల నుంచి 10 వేల ప్రీమియం ఉంటుంది. రోజుకి ఇది రూ.22 మేర వుంటుంది. ఐతే ఇలాంటి ప్రీమియంలు తీసుకునే ముందు ఆదాయవ్యయాలను దృష్టిలో వుంచుకోవాలి. ఆదాయాన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్లున్న వ్యక్తి రూ. 1 కోటి లైఫ్‌ కవరేజీ తీసుకోవాలంటే సుమారుగా 8 నుంచి 10వేల ప్రీమియం వుంటే 40 ఏళ్ల వ్యక్తికి అది ఏకంగా 18 వేల నుంచి 20 వేల దాకా వుంటుంది. 
 
కనుక టర్మ్ పాలసీ ఎంత ముందు తీసుకుంటే అంత మంచిది. ఇకపోతే క్లెయిమ్స్ చేసుకునేటప్పుడు కొంతమందివి రిజెక్ట్ అవుతుంటాయి. దీనికి కారణం పాలసీ టైంలో మీరిచ్చిన సమాచారంతో సరిపోకపోవడం. అంతేకాదు... మీరు సరియైన వివరాలు ఇచ్చినా ఇన్సూరెన్స్ ఏజెంట్ దాన్ని తప్పుగా రాయవచ్చు. ఆ కాపీ మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 
 
ప్రీమియం హోల్డర్ పేరు, నామినీ పేరు, చిరునామా అన్నీ సరిగ్గా వున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ఇళ్లయితే ఇళ్లు మారినప్పుడల్లా చిరునామా మారుతుంటుంది కనుక దాన్ని కూడా అప్ డేట్ చేసుకుంటూ వుండాలి. ఇలా చేసినప్పుడే క్లెయిమ్ చేసుకునేటపుడు ఎలాంటి సమస్య ఎదురు కాకుండా వుంటుంది. ఇంకా ఇన్సూరెన్స్ వివరాలను ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు చెప్పడమే కాకుండా ఆ కాపీల వివరాలను కూడా తెలియజేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేట్ పాల గురించి నోరెత్తకు బాలాజీ.. బాబు అనుకుంటే ఎమ్మెల్యేలు ఊడిపోతారు..