Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంకుల కన్నా తపాలానే మిన్న...! సర్వీస్ చార్జ్ లేని ఏటీఎం కార్డు

మీరు వింటున్నది నిజమే. వచ్చేనెల నుంచి బ్యాంకుల బాదుడికి ప్రజలు ఇప్పటికే ప్రజల్లో భయం పట్టుకుంది. ప్రతి దానికి డబ్బులు కట్టు అన్న నిబంధన ఉండటంతో ఏం ప్రజలకు ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు.

Advertiesment
Postal ATM Cards
, శనివారం, 18 మార్చి 2017 (13:17 IST)
మీరు వింటున్నది నిజమే. వచ్చేనెల నుంచి బ్యాంకుల బాదుడికి ప్రజలు ఇప్పటికే ప్రజల్లో భయం పట్టుకుంది. ప్రతి దానికి డబ్బులు కట్టు అన్న నిబంధన ఉండటంతో ఏం ప్రజలకు ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. అయితే ఇలాంటి మార్గానికి ఒక్కటే సరైన ఉపాయమంటున్నారు తపాలాశాఖాధికారులు. అదెలాగంటారా.. ఇది చదవండి.. చాలా సులువు.
 
తపాలా కార్యాలయాల్లో రూ.50తో అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు వెంటనే ఏటీఎం కార్డులను కూడా అందజేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకొనేందుకు బ్యాంకులు విధిస్తున్న నిబంధనలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా, వినియోగదారులను ఆకర్షించేలా ఎలాంటి సేవా రుసుము లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. ‌
 
ఆ ప్రకారం కనిష్టంగా రూ.50 చెల్లించి తపాలా కార్యాలయాల్లో ఖాతా ప్రారంభించవచ్చు. పాస్‌‌బుక్‌, ఏటీఎం కార్డు సౌకర్యం కలిగిన ఈ ఖాతాల ద్వారా సులభంగా నగదును తీసుకొనే పథకాన్ని ప్రకటించింది. ఈ తపాలా ఏటీఎం కార్డును ఉపయోగించి ఏ పోస్టాఫీసు, ఏ బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచైనా నగదు తీసుకోవచ్చన్నారు. అంతేకాక తపాల ఏటీఎం కార్డు నుంచి ఒకే రోజు ఎన్నిసార్లైనా డ్రా చేసుకోవచ్చు... దానికి సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేకుండా నగదు తీసుకోవచ్చు. 
 
బ్యాంకుల్లాగానే తపాలాపొదుపు ఖాతాలకు నాలుగు శాతం వడ్డీని అందిస్తుంది. పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకింగ్‌ అనే కొత్త పథకంలో డిపాజిట్లపై 4.5 నుంచి 5.5 శాతం వడ్డీని అందించనున్నామని తపాలశాఖ వారు అంటున్నారు.‌ చాలా తక్కువ ఖర్చుతో అకౌంట్ ఓపెన్ చేయడమే కాదు. ఏ బ్యాంకుకు సంబంధించిన ఎటిఎంలోనైనా డబ్బులు తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి.. తపాలాలో ఒక అకౌంట్ ఓపెన్ చెయ్యండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు... ఉగ్రవాదుల పనేనా?