Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

45 కోట్ల రూపాయలను సమీకరించిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌

Advertiesment
Our Food
, మంగళవారం, 25 జనవరి 2022 (21:34 IST)
వినూత్నమైన, అతి తక్కువ వ్యయం కలిగిన మరియు వికేంద్రీకృత మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కలిగిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ ఇప్పుడు తమ గ్రోత్‌ ఫండింగ్‌లో భాగంగా 45 కోట్ల రూపాయలను సమీకరించింది.


ఈ కంపెనీ తమ కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా తయారీ సామర్థ్యం విస్తరించడం, భారతదేశంలో 5 బిలియన్‌డాలర్ల విలువ కలిగిన పంట నష్టం జరుగుతుందని అంచనా కలిగిన వ్యవసాయ ఆహార సరఫరా గొలుసును విస్తృతంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండింగ్‌ రౌండ్‌కు ప్రస్తుత ఇన్వెస్టర్‌ 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌‌తో పాటుగా నూతన ఇన్వెస్టర్‌ సీ4డీ ఆసియా ఫండ్‌ నేతృత్వం వహించాయి. లలిత్‌ జలన్‌, 3లైన్స్‌ ఇండియా ఛైర్మన్‌ మరియు పూర్వ సీఈఓ- రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇప్పుడు కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో చేరారు.

 
దాదాపు 1700కు పైగా గ్రామీణ వ్యవస్థాపకులు అవర్‌ ఫుడ్‌ ఫార్మర్‌ ఫ్రాంచైజీ లైసెన్స్‌లు పొందారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాల్లో పండే పంటకు పరిమితమైన ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. వీరు తమకు దగ్గరలోని గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులనుంచి ముడి పదార్థాలను సేకరించి, ప్రాసెస్‌ చేస్తారు. ప్రతి రైతు ఫ్రాంచైజీ ఒకే మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు మొదలు, యంత్రసామాగ్రి ఋణాలను పొందడం, ప్రాసెసింగ్‌లో శిక్షణ, ప్రాసెస్డ్‌ ఔట్‌పుట్‌ మార్కెటింగ్‌ సహా సమగ్రమైన సాంకేతికాధారిత శక్తిని కలిగి ఉంటుంది.

 
భారతదేశంలో 12 రాష్ట్రాలలో అవర్‌ఫుడ్‌ ఉనికిని చాటుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, కర్నాటకలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి 15కు పైగా పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటిలో పప్పులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, వేరుశెనగ వంటివి ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని పంటలను జోడించనుంది.

 
‘‘ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్న గ్రామీణ యువతకు; ప్రత్యక్ష సరఫరా ద్వారా తమ ఆదాయం పెంచుకునే అవకాశం పొందుతున్న రైతులు మరియు వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన వస్తువులను అందించగల వ్యాపార కొనుగోలు దారులకు అవర్‌ ఫుడ్‌ విలువ ప్రతిపాదన మూడు రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది’’ అని లలిత్‌ జైన్‌ అన్నారు. ‘‘గత రెండు సంవత్సరాల కాలంలో తమ వికేంద్రీకృత ప్రాసెసింగ్‌ ద్వారా 100రెట్ల వృద్ధిని అవర్‌ ఫుడ్‌ చూసింది. ఇది మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో వైవిధ్యమైన ధోరణిని సూచిస్తుంది’’ అని లలిత్‌ వెల్లడించారు.

 
‘‘వ్యవసాయ ఉత్పత్తుల వికేంద్రీకృత ప్రక్రియను వ్యాప్తి  చేయగలిగిన,  విజయవంతమైన భారతదేశంలోని మొట్టమొదటి నమూనా అవర్‌ ఫుడ్‌. అంతర్గత డిజైన్‌ మరియు తయారీ చేయగల ప్రాసెసింగ్‌ యూనిట్లకు తోడు ఫైనాన్సింగ్‌ మరియు దిగుబడులను తిరిగి కొనుగోలు చేస్తామనే హామీ వంటి అంశాలు అతి తక్కువ సమయంలోనే అవర్‌ ఫుడ్‌ను భారత దేశ వ్యాప్త కంపెనీగా మార్చాయి’’ అని అర్వింద్‌ అగర్వాల్‌ (సీఈఓ, సీ4డీ పార్టనర్స్‌) అన్నారు. ‘‘భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం చేరుకోవడంలో అత్యంత కీలకంగా వికేంద్రీకృత వ్యవసాయ ప్రాసెసింగ్‌ నిలుస్తుంది’’ అని అర్వింద్‌ వెల్లడించారు.

webdunia
‘‘ప్రీ ప్రాసెసింగ్‌ నుంచి అత్యధికంగా విలువను పొందడం, సాగు తరువాత వ్యర్థాలను తగ్గించడం మరియు సరఫరా చైన్‌ మధ్యవర్తిత్వం ను ఫ్రాంచైజీ నిర్వాహకుడు మరియు ప్రాసెస్‌ చేయని పంటను సరఫరా చేసే రైతు నడుమ పంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయ క్షేత్రానికి దగ్గరగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను తీసుకురావడానికి అవర్‌ ఫుడ్‌ బృందం అవిశ్రాంతంగా గత ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తుంది మరియు తమ వ్యాపార నమూనాను అత్యుత్తమంగా తీర్చిదిద్ది తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు, ఫైనాన్సింగ్‌, బీ2బీ/బీ2సీ సేల్స్‌లో సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసింది’’ అని బాలా రెడ్డి, ఫౌండర్- సీఈవో, అవర్‌ ఫుడ్‌ అన్నారు.

 
‘‘ఇప్పుడు సేకరించిన నిధులతో మా సామర్థ్యంను 6వేల నిర్వహణ ఫ్రాంచైజీలకు విస్తరించడం వీలు కలుగుతుంది. దీనితో పాటుగా వైవిధ్యమైన ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలో మాదైన స్థానం నిలుపుకునేందుకు తగిన శక్తిని అందించి 2024లో ఐపీఓకు వెళ్లేందుకు తగిన స్థితిలో మమ్మల్ని నిలుపుతుంది’’ అని శ్రీ బాలా రెడ్డి జోడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం - మొగిలయ్య... షావుకారు జానకి...