మహాప్రభో... ఈ గండం నుంచి గట్టెక్కించండి.. మన్మోహనుడి శరణు కోరిన ఉర్జిత్ పటేల్!
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పని చేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే.. చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడు
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో గతంలో పని చేసిన ఆర్బీఐ గవర్నర్లందరికంటే.. చెడు పేరును సంపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. దాదాపు పక్షం రోజుల పాటు మీడియా కంటికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయనపై రాజకీయ నేతలతో పాటు.. ఆర్థికవేత్తలు సైతం అనేక విమర్శలు చేశారు. ఇపుడు ఆయన ముందు ఓ పెద్ద చిక్కు ఉంది. అదేంటంటే.. డీమోనిటైజేషన్ అంశంపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ ఆయనకు నోటీసు పంపింది. దీంతో ఆయన విధిగా కమిటీ ఎదుట హజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆయన మాజీ ప్రధానమంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆశ్రయించారు. ఈ గండం నుంచి గట్టెక్కే ఉపాయం చెప్పాలంటూ ఆయన శరణు కోరారు. దీంతో ఉర్జిత్‌ను మన్మోహన్ సింగ్ ఓ సలహా ఇచ్చారు.
డీమానిటైజేషన్‌కు సంబంధించి ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించేందుకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ విషయంలో మన్మోహన్ జోక్యం చేసుకొని చతురతతో వ్యవహరించే వ్యూహాన్ని వివరించారు. 'మౌనంగా ఉండండి..' పార్లమెంటరీ కమిటీ అడిగే ప్రశ్నలతో ఇబ్బందులు వస్తాయనుకుంటే మౌనం పాటించండి. ఒక్క మాట కూడా నోరు తెరవొద్దు అంటూ సలహా ఇచ్చారు.
అంతేనా, ఆర్‌బీఐకి ఇబ్బంది కలిగే ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వొద్దని సూచించారు. డీమానిటైజేషన్ సందర్భంగా కేంద్రం ఆర్‌బీఐని పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో మన్మోహన్ ఈ సలహా ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ పరిస్థితి మరింత జఠిలం కాకుండా మన్మోహన్ తన చతురతతో సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.