Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపర్ కాయిల్స్ కలిగిన ఏసీ మెషిన్లతో లాభమేంటి?

వేసవికాలం వచ్చేసింది. ఎండు మండిపోతున్నాయ్. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఎయిర్ కండిషనర్ల (ఏసీల) వినియోగం కూడా బాగా పెరిగిపోతోంది. ఇటీవలికాలంలో మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరల్

కాపర్ కాయిల్స్ కలిగిన ఏసీ మెషిన్లతో లాభమేంటి?
, మంగళవారం, 21 మార్చి 2017 (15:42 IST)
వేసవికాలం వచ్చేసింది. ఎండు మండిపోతున్నాయ్. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఎయిర్ కండిషనర్ల (ఏసీల) వినియోగం కూడా బాగా పెరిగిపోతోంది. ఇటీవలికాలంలో మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఏసీలు లభిస్తున్నాయి. కానీ చాలా మందికి ఏసీల గురించి సరైన అవగాహన లేదు. ఏసీ కొనుగోలు చేద్దామని ఉన్నా.. వినియోగం, నిర్వహణ, కరెంటు బిల్లు వంటి అంశాలను కూడా లెక్క చేయకుండా ఏసీలు కొనుగోలు చేసేందుకు గృహ వినియోగదారులు పోటీ పడుతున్నారు. అలాంటి వారు తాము కొనుగోలు చేసిన ఏసీల్లో ఉండే కాయిల్స్‌ అల్యూమినియం కాయిల్సా లేదా కాపర్ కాయిల్సా అనే విషయాన్ని పరిశీలిస్తే.. 
 
సాధారణంగా ఏసీల్లో రెండు రకాల కాయిల్స్ ఉంటాయి. గదిలోని వేడిని గ్రహించడానికిగానీ, బయట వేడిని వదిలేయడానికిగానీ రిఫ్రిజిరెంట్ ప్రవహించేది ఈ కాయిల్స్‌లోనే. అందువల్ల ఏసీల సామర్థ్యం కాయిల్స్ తయారైన లోహంపైనా ఆధారపడి ఉంటుంది. అయితే కాపర్ ధర ఎక్కువ కావడం వల్ల వాటిని వినియోగించే ఏసీల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అల్యూమినియం కాయిల్స్ ఉన్న ఏసీల ధరలు తక్కువగా ఉంటాయి. 
 
కాపర్ కాయిల్స్ వేడిని గ్రహించడం, వదిలేయడంలో అల్యూమినియం కన్నా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందువల్ల ఏసీ పనితీరు వేగంగా, సమర్థవంతంగా ఉంటుంది. పైగా, కాపర్ కాయిల్స్ దృఢంగా ఉంటాయి. వాటిలో ఏదైనా లోపం ఏర్పడినా, దెబ్బతిన్నా మరమ్మతు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే అల్యూమినియం కాయిల్స్ అయితే చాలా వరకు రీప్లేస్ చేయాల్సి వస్తుంది.
 
సాధారణంగా ఏసీల ఔట్ డోర్ యూనిట్‌లో కాయిల్స్ ఉంటాయి. బయట వాతావరణ పరిస్థితులు, దుమ్ము, తేమ వంటి వాటి కారణంగా.. అప్పుడప్పుడు కాయిల్స్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లలో కాపర్ కాయిల్స్‌ను శుభ్రం చేయడం సులువు. అదే అల్యూమినియం కాయిల్స్ అంత దృఢంగా ఉండనందున వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
 
కాపర్ కాయిల్స్‌కు సంబంధించి తుప్పు సమస్య పెద్దగా ఉండదు. కానీ అల్యూమినియం కాయిల్స్‌లోని అతుకులు, కంప్రెషర్, ఎవాపరేటర్‌తో అనుసంధానమయ్యే భాగాలు తుప్పుపట్టి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరతావనిలో తొలి జీవి ఆ నది... మానవులకు ఉన్న అన్ని హక్కులూ ఆ నదికి కల్పిస్తున్నాం: హైకోర్టు