పెళ్లి ఖర్చులకు ఆర్బీఐ షరతు : కాళ్లు కడిగినందుకు బావమరిదికి ఇచ్చే డబ్బులకు కూడా బిల్లులు కావాలి!
దేశంలో పెద్ద నోట్ల కష్టాలు ప్రతి ఒక్కరిపైనా తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల వివాహాలు ఆగిపోయాయి. అదేసమయంలో దేశ ప్రజలు కష్టాలు వర్ణనాతీతం. తమ ఖాతాల్లో ఉన్న డబ్బ
దేశంలో పెద్ద నోట్ల కష్టాలు ప్రతి ఒక్కరిపైనా తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల వివాహాలు ఆగిపోయాయి. అదేసమయంలో దేశ ప్రజలు కష్టాలు వర్ణనాతీతం. తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను తీసుకునేందుకు బ్యాంకుల ముందు.. ఏటీఎం సెంటర్ల ముందు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కానీ, బ్యాంకులతో పాటు.. ఏటీఎం కేంద్రాల్లో పైసా డబ్బులు లేవు. ఇదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి.
అయితే, నోట్ల రద్దు ప్రభావంతో పెళ్లికి సంబంధాలు కుదుర్చుకుని, ముహుర్తాలు ఖరారు చేసుకున్న తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. పెళ్లి నిమిత్తం బ్యాంకుల్లో రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రకటనపై అందరూ హర్షం వ్యక్తంచేశారు. కానీ ఇంతలోపే అనేక షరతులను ఆర్బీఐ విధించింది. ఈ షరతులు చూసిన తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.
పెళ్లి ఖర్చుల నిమిత్తం ఏది కొన్నా రశీదులివ్వాలన్న నిబంధన పెట్టింది. ప్రతీ ఖర్చుకూ బిల్లు చూపించాని కోరుతోంది. పెళ్లికి పెట్టే డబ్బులో చాలావరకూ బిల్లులు లేకుండానే ఖర్చవుతుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా పెళ్లిలో ఆడే సాంప్రదాయ ఆటలకు కూడా రశీదులు తెమ్మంటే ఎక్కడ నుంచి తేవాలో ఆర్బీఐ అధఇకారులే చెప్పాలి. అలాగే, బావ కాళ్లు కడిగినందుకు బావమరిదికి ఇచ్చే డబ్బుకు, ఆడపడుచులకు కానుకగా ఇచ్చే డబ్బుకు రశీదులు ఎలా ఇవ్వగలమని పలువురు తల్లిదండ్రులు ఆర్బీఐ అధికారులను సూటిగా అడుగుతున్నారు.