Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో వాడితే అదొక్కటే లాభం.. నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ పెరిగితే.. నాణ్యమైన సేవలు గోవిందా?

జియో ప్లాన్ ప్రస్తుతం ప్రపంచమంతా సెన్సేషనల్ అయ్యింది. మూడు నెలల పాటు ఫ్రీ అంటూ ప్రకటన చేసి విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న రిలయన్స్.. జియో ద్వారా తక్కువేం తినదంటున్నారు.. వాణిజ్య నిపుణులు. జియో వా

జియో వాడితే అదొక్కటే లాభం.. నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ పెరిగితే.. నాణ్యమైన సేవలు గోవిందా?
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (15:05 IST)
జియో ప్లాన్ ప్రస్తుతం ప్రపంచమంతా సెన్సేషనల్ అయ్యింది. మూడు నెలల పాటు ఫ్రీ అంటూ ప్రకటన చేసి విపరీతమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న రిలయన్స్.. జియో ద్వారా తక్కువేం తినదంటున్నారు.. వాణిజ్య నిపుణులు. జియో వాడకం ద్వారా ఇంటర్నెట్ బిల్లు తగ్గించుకోవచ్చునని వినియోగదారులు భావించవచ్చు. కానీ ప్రస్తుతం జియో ప్రకటించిన ధరలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయి. అంతవరకు ఇవే ధరలు కొనసాగుతాయని మాత్రమే రిలయన్స్ వెల్లడించింది. తద్వారా ధరలు మారిపోయే లేదా పెరిగిపోయే ఆస్కారం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 
రిలియన్స్ జియో రూ. 149 నుంచి రూ. 4,999 మధ్య పలు రకాల టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. కానీ ఇవన్నీ 30 రోజులు కాకుండాడ 28 రోజులకే పరిమితమయ్యాయి. ఎంట్రీ లెవల్‌ ప్యాకేజీ అంటే రూ. 149లో కేవలం 300 మెగాబైట్ల డేటా మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ డేటా వాడుతున్న వారంతా 300 మెగాబైట్ల వాడకాన్ని ఎప్పుడో దాటేశారు. 
 
దీనితో.. జియో ప్రకటించిన తదుపరి అందుబాటులోని ప్యాకేజ్ రూ. 499కు వెళ్లాల్సిందే. కారణం.. డేటా అవసరాలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఎంతో అవసరం కాబట్టి. ఇక జియో ఇచ్చే రూ. 499 ప్యాకేజీలో 4 జీబీ డేటా లభిస్తుంది. తద్వారా ఈ ప్యాకేజీని ఎక్కువమంది ఎంచుకునే వీలుంటుంది. ఈ ప్యాకేజీల మధ్య రూ. 299కి ఓ టారిఫ్ ఉన్నప్పటికీ.. అది రోజుల విషయానికి వచ్చే 21కే పరిమితం. ప్రస్తుతం సరాసరిన ఎయిర్ టెల్ వినియోగదారులు నెలకు 1 గిగాబైట్ల డేటాను వాడుతున్నారు. ఎయిర్ టెల్, ఓడాఫోన్ తదితర కంపెనీలు గరిష్ఠంగా రూ. 250కి 1జీబీ అందిస్తున్నాయి.
 
ఇక ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగదారుడు సగటున కాల్స్ చేసేందుకు వెచ్చిస్తున్న మొత్తం నెలకు రూ. 200 కన్నా తక్కువే. దీంతో పోలిస్తే.. రూ. 450తో నెలంతా లాక్కొచ్చే కస్టమర్, జియోకు మారితే మరింత చెల్లించుకోవాల్సి వుంటుంది. దీనిని బట్టి జియోతో బిల్లు తగ్గడమనేది కూడా ఉత్తుత్తిదే. జియో ద్వారా అదనపు డేటా లభించడం మాత్రమే ప్లస్ పాయింట్. సో జియోతోనూ వినియోగదారులకు ఉపయోగమెంతో అంచనా వేసుకోవాల్సిందే.
 
ఇంకా చెప్పాలంటే.. రిలయన్స్ జియో డేటా ప్లాన్లతో చాలా వాటితో పోలిస్తే ఇప్పటికే సేవలు అందిస్తున్న కంపెనీ ఛార్జీలకు పెద్దగా తేడా ఏం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) అంటోంది. వినియోగదారులను పెంచుకోవడంతో ద్వారా నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుందని.. తద్వారా నెట్ స్లో అయ్యే సమస్యలు ఉత్పన్నమవుతాయని సీవోఏఐ వెల్లడించింది. నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ గణనీయంగా పెరిగితే నాణ్యమైన సేవలందించడం జియోకు సవాలుగా పరిణమించనుందని సీవోఏఐ పేర్కొంది. నెట్ వర్క్ సమస్యలు జియో వినియోగదారులకు తప్పవన్నట్లు విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. 
 
జియో ద్వారా వినియోగదారుల సంఖ్యను పది కోట్ల స్థాయికి పెంచుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. పదికోట్ల వినియోగదారులు పెరిగితే నెలకు సంస్థ నెట్‌వర్క్ ద్వారా సరాసరిగా వాడే డాటా వాడకం 250 కోట్ల గిగాబైట్లకు పెరిగేందుకు అవకాశం ఉంటుందని ముకేష్ అంబానీ వెల్లడించారు. నెట్‌వర్క్ పరీక్షల సమయంలోనే జియో 15 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోగలిగిన ఈ సంస్థ.. 4జీ సేవలతోపాటు సంస్థ లైఫ్ బ్రాండ్‌నేమ్‌తో స్మార్ట్‌ఫోన్లను కూడా ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు సోనీ, సాన్‌సూయి, టీసీఎల్, అల్కాటెల్, హెచ్‌టీసీ, ఇంటెక్స్, వివో, జియోనీ, కార్బన్, లావా, వీడియోకాన్, ఎల్‌జీ, సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, పానాసోనిక్, ఆసుస్ కంపెనీలకు చెందిన 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు సైతం ఈ నాలుగు నెలలపాటు ఉచిత డాటా, కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోరిడా స్పేస్ఎక్స్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భారీ పేలుడు.. ఫాల్కన్ 9 రాకెట్?