Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెయిన్ పైన గెలవాలంటే మీరు హస్త ప్రయోగం చేస్కోవాల్సిందే... పోర్చుగల్ గోల్ కీపర్ భార్య

ఫిఫా 2018 ప్రపంచ కప్ గెలిచి తీరాలని ప్రతి ఒక్క జట్టూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 15న పోర్చుగల్ - స్పెయిన్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపధ్యంలో పోర్చుగల్ గోల్ కీపర్ ర

Advertiesment
Portugal
, సోమవారం, 11 జూన్ 2018 (15:11 IST)
ఫిఫా 2018 ప్రపంచ కప్ గెలిచి తీరాలని ప్రతి ఒక్క జట్టూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 15న పోర్చుగల్ - స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపధ్యంలో పోర్చుగల్ గోల్ కీపర్ రూయ్ పాట్రిసియోస్ భార్య వెరా రిబీరో షాకింగ్ సూచనలు చేసింది. అది కేవలం తన భర్తకే కాదు... జట్టు సభ్యులందరూ తను చెప్పినట్లు చేస్తే విజయం ఖాయమని సెలవిచ్చింది. 
 
ఇంతకీ ఆమె చెప్పినదేంటయా అంటే... మరో నాలుగు రోజుల్లో స్పెయిన్ జట్టుతో ఢీకొంటున్న సందర్భంగా తన భర్తతో సహా అందరూ ఆటకు వెళ్లే ముందు హస్త ప్రయోగం చేసుకోవాలని చెపుతోంది. అలా జట్టు సభ్యులందరూ హస్త ప్రయోగం చేసుకోవడం వారిలో కొత్త ఉత్సాహం వస్తుందనీ, ఫలితంగా ఆట తీరు అద్భుతంగా వుంటుందనీ, ప్రతి ఒక్కరూ రాణిస్తారని చెపుతోంది. చాలామంది ఆటలో పాల్గొనే ముందు శృంగారంలో పాల్గొనాలని సలహాలిస్తుంటారనీ, కానీ తను మాత్రం హస్త ప్రయోగం అనేది శృంగారాన్ని మించినదంటూ సలహా ఇస్తోంది.
 
ఈమె తన సలహాలను బుక్‌లెట్‌గా వేసి ఆటగాళ్లకు పంచుతోందట. ఇంతకీ ఈమె ఎవరయ్యా అంటే... సెక్స్ థెరపిస్టులో ప్రావీణ్యత సాధించిన వైద్యురాలు. పైగా మానసిక వేత్తగా కూడా అనుభవం వుంది. ఇప్పటివరకూ తను చేసిన పలు పరిశోధనలను చూసిన తర్వాతే ఇలా హస్త ప్రయోగం సలహా ఇచ్చినట్లు ఆమె చెపుతోంది. మరోవైపు ఇరు జట్ల బలాబలాలను చూస్తే పోర్చుగల్ గంటే స్పెయిన్ మెరుగైన దశలో వుంది. ఆ జట్టు సభ్యులు అన్ని రకాలుగా మంచి ప్రావీణ్యతను కలిగి వున్నారు. ఈ నేపధ్యంలో ఆ జట్టుపై విజయం సాధించాలంటే పోర్చుగలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ కష్టం ఎలా వున్నా హస్త ప్రయోగం చేస్కుంటే చాలంటోంది గోల్ కీపర్ భార్య. మరి... పోర్చుగల్ జట్టు ఏం చేస్తుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్.. ఛెత్రి అదుర్స్.. భారత్‌కే కప్