Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Advertiesment
Significance of Ugadi pachadi
ఉగాది పచ్చడి.. షడ్రుచుల సమ్మేళనం. ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితమంటే అన్నీ అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతమనే చెప్పే భావం ఉగాది పచ్చడిలో ఉంది. 
 
పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక - 
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu