Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనుమాన్ జయంతి: చైత్ర పూర్ణిమ రోజున పూజ చేస్తే ఫలితం ఏమిటి? ఆరెంజ్ రంగులో?

Advertiesment
Happy Birthday Lord Hanuman
, శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (13:26 IST)
చైత్ర మాస పూర్ణిమ రోజున దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో గడుపుతారు. హనుమాన్ జయంతి (ఏప్రిల్ 22న) కావడంతో రామభక్తుడైన హనుమంతుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు హనుమంతుడికి వెన్న, తమలపాకులు, వడమాలలను ఆయనకు సమర్పించి భక్తితో పూజలు చేస్తున్నారు. 
 
వానర దేవుడైన హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజున వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదని పండితులు అంటున్నారు. శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం. 
 
లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు.. దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని.. ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. అలాంటి హనుమయ్యను హనుమజ్జయంతి రోజున ఎలా పూజించాలంటే..?
 
* హనుమాన్ చాలిసాను ఈ రోజున పఠించడం ద్వారా వాయుపుత్రుడి అనుగ్రహం పొందవచ్చు. హనుమాన్ చాలీసా ధైర్యాన్ని, శక్తి, కొత్త ఉత్తేజాన్ని ప్రసాదిస్తుంది. 
 
* మీకు సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకోవడం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించి.. హనుమాన్ ఆలయంలో ఇచ్చే లడ్డూ, బూందీలను ప్రసాదంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
ఆరెంజ్ రంగు దుస్తుల్ని ధరించడం లేదా.. హనుమాన్‌కు నారింజ రంగు వస్త్రాలను సమర్పించుకుంటే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇక రామాలయాన్ని కూడా హనుమజ్జయంతి రోజున దర్శించుకోవడం సర్వ శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu