వసంత పంచమి గురువారం వస్తోంది. జనవరి 26న వసంత పంచమిని దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకోనున్నారు. వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తారు. మాఘ మాసంలోని ఐదవ రోజున వస్తుంది వసంత పంచమి. ఈ పండుగ సరస్వతీ దేవికి అంకితం. ఈ ఏడాది జనవరి 26న వసంత్ పంచమి జరుపుకుంటారు
తన భార్యను విడిచిపెట్టినందుకు మనస్తాపం చెందిన కాళిదాసు నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలని యోచించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో సరస్వతీ దేవి కటాక్షంతో ఆయన జ్ఞానాన్ని పొంది గొప్ప కవిగా మారడంతో అతని జీవితం మారిపోయింది. అలా ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం ద్వారా దుఃఖాలు తొలగిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతిదేవి, కామదేవులు.. వసంత రుతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే ఉత్తరాదిన హోలీలా ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ రోజున పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలు పసుపు దుస్తులను ధరించి, సరస్వతీ దేవిని పూజిస్తూ, సాంప్రదాయ వంటకాలను తింటూ రోజు జరుపుకుంటారు. పసుపు రంగు జ్ఞానాన్ని సూచిస్తుంది.
ప్రకారం పంచమి తిథి జనవరి 25, 2023న మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమవుతుంది.జనవరి 26, 2023న ఉదయం 10:28 గంటలకు ముగుస్తుంది. పండుగ ముహూర్తం ఉదయం 7:12 నుండి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది.