మనలో చాలామంది సక్సెస్‌ఫుల్ బిజినెస్ మాన్‌లాగా, ఇతర రంగాల్లో ముఖ్య వ్యక్తులుగా చెలామణి అవుతుంటారు. వాస్తవానికి మనం ఈ స్థానానికి చేరుకోవడానికి మన తెలివి తేటలు, పట్టుదల, నిరంతర కృషి, పట్టుదల లేకపోతే కష్టపడేతత్వమేకావచ్చు. అయితే కొంత మంది తెలివితేటలు ఉన్నవారు తెలివితేటలను బయటికి ప్రదర్శించలేక పోవచ్చు.
ప్రతిభను బయటకు చూపని వారికి కొన్ని చిట్కాలున్నాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. మీ ఆఫీసు టేబుల్‌పై దీర్ఘ చతురస్త్రాకారపు స్ఫటికాన్ని ఉంచితే అభివృద్ధి జరిగి లైమ్‌లైట్‌లోకి వస్తారని, దీనిని అఫీసులో డెస్క్ మీద ఎడమ వైపు ఉండవచ్చునని, వీలైతే ఈ స్ఫటికాన్ని పేపర్ వెయిట్‌లా కూడా వాడుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
స్ఫటికాలతో మీ భార్యాభర్తలు, కుటుంభ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం లాంటి మంచి భావనలు కలుగుతాయని, వాటిని నైరుతి వైపున ఉంచాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. స్ఫటికాలను ఉపయోగించడానికి ముందుగా వాటిలోని వ్యతిరేక శక్తులను పోగొట్టడానికి ఇరవైనాలుగు గంటలపాటు ఉప్పు నీటిలో ఉంచినట్లైతే.. వాటి శక్తులు నశిస్తాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
తర్వాత స్ఫటికాలను మూడుగంటల పాటు ఎండలో ఉంచాలని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. ఆ స్ఫటికానికి సూర్యుని కాంతి తగిలేవిధంగా కిటికీ ప్రక్కన వ్రేలాడదీస్తే స్ఫటికం నుండి వెలువడే కాంతికి ఇంట్లో రంగుల వలయాలు ఏర్పడటమేకాకుండా ఆ కుటుంబంలో అందరికీ తెలివిని, శక్తిని ఇస్తాయని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. పిల్లల చదువులపై శ్రద్దా శక్తులు పెరగటానికి ఈశాన్య మూలలో స్ఫటికాన్ని బంతిలా వేలాడదీసినట్లైతే మంచి ఫలితాన్నిస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.