మీ స్టోర్ రూంలో 2, 3 కృత్రిమ మొక్కలను ఉంచితే శుభప్రదమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. సామాన్లు మరీ ఎక్కువగా ఉంటే.. దుమ్ము, ధూళి పట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి. అలాగే ఆ గది దిశకు సంబంధించిన బాఘువా తత్వపు రంగున్న బల్పును మీ వీలును బట్టి వెలిగించుకోండి.
ఇకపోతే... తూర్పుదిశగా కిచెన్ ఉండకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలా ఉన్నట్లైతే... పరిష్కారంగా 5 రాడ్‌ల విండ్‌చిమ్‌ని పెట్టుకోండి. లోహానికి సంబంధించిన విండ్‌చిమ్‌ను తూర్పు దిశగా పెట్టడం ఏ మాత్రం హానికరం కాదు.
5 రాడ్‌ల లోహపు విండ్‌చిమ్‌ను తూర్పుదిశగా ఏర్పాటు చేయడం ద్వారా ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం యిన్-యాంగ్‌ల సమతుల్యానికి సౌకర్యంగా ఉంటుంది. తూర్పుదిశలో కిచెన్ ఉంటే.. ఉట్టి లోహం మాత్రమే కాకుండా, ఉక్కు లాంటి ఏదేని లోహముతో 5 రాడ్‌ల విండ్‌చిమ్‌ను అమర్చుకోవచ్చు.
ఇదిలా ఉంటే... ఇంటి గోడలో ఎక్కడైనా రాళ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లయితే... ఆ ప్రాంతంలో ఒక మొక్క లేదా శిల్పం పెట్టండి. (దిశను బట్టి దానికి సంబంధించిన బాఘవా తత్వపు రంగున్న బల్బును 21 రోజులనుండి 3 నెలల వరకు నిరంతరాయంగా వెలిగించి ఉంచండి.) అదే విధంగా ఇంట్లోని ఏదేని ఫర్నిచర్ లేదా ఒక మూల బయటకు పొడుచుకుని వస్తే కూడా పైవిధంగా బాఘవా తత్వపు రంగు బల్బులను వెలిగించుకోవచ్చు.
క్రిస్‌మస్ ట్రీ లాంటిది లేదా వినాయక చవితి పండుగల్లో అలంకరించే ఒక స్టాండుకున్న త్రికోణాకారపు చెట్టులాంటిది మార్కెట్‌లో లభిస్తుంది. దానికి రంగురంగుల చిన్న బల్బులు కూడా ఉంటాయి. అలాంటిది దొరికితే పై సమస్యకు ఇంకా చక్కని పరిష్కారం లభించినట్లే...!